తమిళనాడు రాజధాని చెన్నై వణుకుతోంది. చెన్నై వాసులు భయం భయంగా గడుపుతున్నారు. వరద ముంపు భయం చెన్నై వాసుల్ని వెంటాడుతూనే వుంది. పదిరోజులు తమిళనాడులోని చెన్నై, కన్యాకుమారి, కాంచీపురం, తిరువళ్ళూరు, మధురై, తిరుచ్చి, కోయంబత్తూరు సహా పలు జిల్లాలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత అనుభవాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. భారీ వర్షాలతో పుయల్, చంబారపాకం డ్యాంలు నీటితో కళకళలాడుతున్నాయి. సామర్ధ్యానికి మించి నీటిని నిల్వచేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో అధికారులు…