కృష్ణంరాజు ఎందరు కథానాయికలతో నటించినా, ఆయనకు అచ్చివచ్చిన నాయిక వాణిశ్రీ అనే చెప్పాలి. వాణిశ్రీతో కలసి కృష్ణంరాజు అంతకు ముందు పలు చిత్రాలలో నటించారు. కొన్ని చిత్రాలలో ఆమెను రేప్ చేయబోయే విలన్ గానూ కనిపించారు. అయితే వారిద్దరూ కలసి నవలా చిత్రం `జీవనతరంగాలు`లో అక్క-తమ్ముడుగా నటించారు. ఆ సినిమా ఇద్దరికీ మంచి పేరు సంపాదించి పెట్టింది. తనకు హీరో అవకాశాలు అంతగా లభించని సమయంలో మిత్రులు హరిరామజోగయ్య, చలసాని గోపితోకలసి గోపీకృష్ణా మూవీస్ అనే బ్యానర్…