తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం, కుమారదేవం గ్రామంలో గోదావరి నది తీరంలో ‘సినిమా చెట్టు’ మళ్లీ జీవం పోసుకుంది. తెలుగు సినీ పరిశ్రమలో దాదాపు 300కి పైగా చిత్రాలకు సాక్షిగా నిలిచిన ఈ నిద్రగన్నేరు వృక్షం, దర్శకులు, నటులు మరియు సినీ అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. గతేడాది గోదావరి వరదల సమయంలో ఈ మహావృక్షం రెండుగా చీలి నేలవాలిపోవడంతో సినీ ప్రియులు, స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చెట్టును కాపాడాలని…