తిరుమలలో వైకుంఠ ఏకాదశికి టీటీడీ అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. 2025 జనవరి 10 నుంచి 19 వరకు ఉత్తర ద్వార దర్శనాలకు సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ.. పలు నిర్ణయాలు తీసుకున్నారు. 10 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనాలకు టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. టోకెన్లు లేని భక్తులను క్యూ లైన్లోనికి అనుమతించరు. అలానే ప్రోటోకాల్ ప్రముఖులు మినహా.. వీఐపీ బ్రేక్ దర్శనాలను 10 రోజుల పాటు రద్దు…