సీఎం క్యాంపు కార్యాలయంలో వైయస్సార్ వాహనమిత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా మూడో విడత ఆర్థిక సాయాన్ని సర్కార్ విడుదల చేసింది. అనంతరం సిఎం జగన్ మాట్లాడుతూ.. పాదయాత్ర సమయంలో ఏలూరు సభలో మే 14, 2018న మాట ఇచ్చామని.. ఆటోడ్రైవర్లు నా దగ్గరకు వచ్చి బాధలు చెప్పుకున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో బాదుడు ఎక్కువైంది, పెనాల్టీలు ఎక్కువైపోతున్నాయని ఆవేదన చెందారని.. అప్పులు తెచ్చి ఇన్సూరెన్స్, మరమ్మతులు, పెనాల్టీలు కడుతున్నామని చెప్పారని వెల్లడించారు. వారికిచ్చిన మాటను నిలబెట్టుకుంటూ…