మాదాపూర్ గుట్టల బేంగంపేట వడ్డెర కాలనీలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. గత రెండు రోజుల క్రితం 20మంది వాంతులు, వీరేచనాలు, జ్వరంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయితే ఇప్పుడు బాధితుల సంఖ్య 76కు చేరుకుంది. అంతేకాకుండా బాధితులు లో 30 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కలుషిత నీరు తాగడం వలనే అనారోగ్యంకి కారణమని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. అందరూ ఒకే లక్షణాలు తో హాస్పిటల్ లో చేరడంతో కాలనీ వాసుల ఆరోపణలపై ప్రాధాన్యత సంతరించుకుంది.…