వాక్సినేషన్ కార్యక్రమంపైన ప్రజల నుంచి సలహాలను, సూచనలను మంత్రి కే తారకరామారావు ఈ రోజు స్వీకరించారు. ఆస్క్ కేటీఆర్ పేరుతో కోనసాగిన ట్విట్టర్ సంభాషణలో మంత్రి పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తు, ప్రజల నుంచి వచ్చిన విలువైన సలహాలు పైన సూచనలు పైన స్పందించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వాక్సినేషన్ కార్యక్రమానికి సంబంధించిన పలు అంశాలను ప్రజలకు వివరించారు. తెలంగాణలో వ్యాక్సినేషన్ పక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నదని, ఓల్డ్ ఏజ్ హోమ్ ల్లోనూ వాక్సినేషన్…