బ్రిటిష్ కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ తన కొత్త సూపర్‌కార్ వాన్‌క్విష్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆకర్షణీయమైన లుక్స్, శక్తివంతమైన V12 ఇంజిన్‌తో కూడిన ఈ సూపర్ లగ్జరీ కారు ప్రారంభ ధర రూ. 8.85 కోట్లు (ఎక్స్-షోరూమ్). ప్రపంచవ్యాప్తంగా 1,000 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ యూనిట్లలో కొన్ని భారతదేశంలో కూడా అమ్మకానికి ఉంచనుంది. అయితే, భారతదేశంలో ఎన్ని యూనిట్లను అమ్మకానికి ఉంచారనే దానిపై కంపెనీ సమాచారం ఇవ్వలేదు.
ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్.. భారతదేశంలో రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ II లైనప్‌ను ప్రారంభించింది. ఈ ఆటోమేకర్ తన ప్రామాణిక ఘోస్ట్ సిరీస్ II, ఎక్స్‌టెండెడ్ ఘోస్ట్ సిరీస్ II, బ్లాక్ బ్యాడ్జ్ ఘోస్ట్ సిరీస్ II మోడళ్లను ఇండియాలో విడుదల చేసింది.