ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అధికార, విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజా సమస్యలపై పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు. రాష్టంలో జరుగుతున్న కొన్ని ఘటనలపై ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. అయితే ఆ సమయంలో ఝాన్సీ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే పొగాకు నములుతూ.. మహోబా ఎమ్మెల్యే వీడియో గేమ్ ఆడుతూ కెమెరాకు చిక్కారు.