Uttam Kumar: తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 70 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మొత్తం 12 స్థానాలను కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందన్నారు.