Adani: అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కెన్యా దేశంతో అదానీ గ్రూపుతో చేసుకున్న భారీ ఒప్పందాలను రద్దు చేసుకుంది. కెన్యా రాజధాని నైరోబిలోని జోమో కెన్యాట్టా అంతర్జాతీయ విమానాశ్రయంపై నియంత్రణను అదానీ గ్రూపుకు అప్పగించాలని భావించిన సేకరణ ప్రక్రియను రద్దు చేయాలని కెన్యా అధ్యక్షుడు విలియం రూటో గురువారం ఆదేశించారు.