Nehal Modi: పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారీ నీరవ్ మోడీ సోదరుడు నేహాల్ మోడీని అమెరికాలో అధికారులు అరెస్ట్ చేశారు. భారత అప్పగింత అభ్యర్థన మేరకు అమెరికా అధికారులు ఇతడిని అదుపులోకి తీసుకున్నారు. నేహాల్ మోడీని కోట్లాది రూపాయల పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) కుంభకోణానికి సంబంధించి అమెరికాలో అరెస్టు చేశారు, ఇది భారతదేశానికి పెద్ద దౌత్య విజయం. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ ప్రకారం, బెల్జియన్ జాతీయుడైన నేహాల్ మోడీని జూలై 4న అదుపులోకి తీసుకున్నారు.