ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు ఇంకా పూర్తిగా అధికారాన్ని చేజిక్కించుకోకముందే తమ ఆరాచక పాలనను మొదలుపెట్టారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో షరియా చట్టాలను అమలు చేస్తున్నారు. దీనికి సంబందించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాబూల్‌లోని ప్రజలను ఏమీ చేయబోమని చెబుతూనే, ఆఫ్ఘన్ ప్రభుత్వానికి, యూఎస్ ఆర్మీకి సహకరించిన వారి వివరాలు సేకరించడం మొదలుపెట్టారు. ఇంటింటికి వెళ్లి వివరాలు కనుక్కునే ప్రయత్నాలు మొదలయ్యాయి. దీంతో కాబూల్ వాసుల్లో తెలియని భయం నెలకొన్నది. ఇప్పటి వరకు సాధారణ జీవనం…
ఆఫ్ఘనిస్తాన్ నుంచి నాటో బలగాలు తప్పుకుంటున్నాయి. నాటో, అమెరికా బలగాలు తప్పుకోవడంతో ఆ దేశంలో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్‌లోని అనేక ప్రాంతాలను తాలిబన్ ఉగ్రవాదులు తమ ఆదీనంలోకి తీసుకున్నారు. ప్రతిరోజు అక్కడ హింసలు చెలరేగుతున్నాయి. ఉగ్రవాదుల దౌర్జన్యాలకు అమాయకమైన ప్రజలు బలి అవుతున్నారు. అమెరికా, నాటో బలగాలు తప్పుకోవడంపై అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ విమర్శించారు. అమెరికా, నాటో బలగాలు ఆఫ్ఘన్ నుంచి తప్పుకోవడం మంచి నిర్ణయం కాదని, బలగాల ఉపసంహరణ తరువాత…