పశ్చిమాసియా మరోసారి నివురుగప్పిన నిప్పులా మారింది. అమెరికా జరిగిస్తున్న బాంబుల దాడితో దద్దరిల్లుతోంది. దీంతో గత కొద్దిరోజులుగా రక్తపుటేరులు పారుతున్నాయి.
కంట్రోల్ సెంటర్లు, రాకెట్, క్షిపణి, డ్రోన్ నిల్వల గోడౌన్‌లతో పాటు లాజిస్టిక్స్ సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా సైనిక వైమానిక దాడులు జరిపినట్లు వెల్లడించింది. యూఎస్ దళాలు 85 స్థావరాలపై 125కు మించిన యుద్ధ సామగ్రితో దాడి చేశాయి.