ప్రస్తుతం యువత టాటూలు వేసుకోవడంలో చాలా ఉత్సహం చూపుతున్నారు. తమకు ఇష్టమైన వారి పేర్లు, ఫొటోలను శరీరంలోని పలు భాగాలపై టాటూ రూపంలో వేయించుకుంటున్నారు. అయితే ఇటువంటి టాటూల కారణంగా సమస్యల్లో పడతారని చాలామందికి తెలియదు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువత టాటూలకు సంబంధించిన కొన్ని నిబంధనలను గుర్తుంచుకోవాలి.