మహిళల టీ20 ప్రపంచకప్ 2024 కొత్త షెడ్యూల్‌ను ఐసీసీ (ICC) సోమవారం ప్రకటించింది. అక్టోబర్ 3 నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో టోర్నీ ప్రారంభం కానుంది. కాగా.. ఈ టోర్నీలో ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 20న జరగనుంది. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లు తలపడనున్నాయి.