Upcoming Electric Cars in 2023: కొత్త సంవత్సరంలో.. కొత్త విద్యుత్ కార్ల లాంఛింగ్‌లతో.. ఆటోమొబైల్ రంగం అద్దిరిపోనుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. టాటా మోటార్స్, మహింద్రా, ఎంజీ తదితర సంస్థలు 2023లో నూతన మోడళ్లను ప్రవేశపెట్టనున్నాయి. ఇండియాలో ఇంధన ధరలు పెరగటం మరియు ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కి ప్రోత్సాహం కోసం ప్రభుత్వం సబ్సిడీలను ఆఫర్ చేస్తుండటంతో ఈవీ సెక్టార్‌కి బూస్ట్ లాంటి సానుకూల వాతావరణం నెలకొందని నిపుణులు పేర్కొంటున్నారు.