UP Encounters: ఉత్తరప్రదేశ్ యోగి ప్రభుత్వం ఎన్‌కౌంటర్లకు చిరునామాగా మారుతోంది. పేరు మోసిన నేరస్థులను మట్టుపెట్టడంలో యోగి ప్రభుత్వం అనుసరిస్తున్న "జీరో టాలరెన్స్" విధానం సంచలనం సృష్టిస్తోంది. ఉత్తరప్రదేశ్ పోలీసులు గత ఎనిమిదిన్నర సంవత్సరాలలో 15,726 ఎన్‌కౌంటర్లు చేశారు. 256 మంది పేరుమోసిన నేరస్థులను హతమార్చారు.
UP: ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు ఇటీవల ఉత్తరప్రదేశ్ పోలీసులు ఒక పెద్ద ఆపరేషన్ ప్రారంభించారు. కేవలం 48 గంటల్లో ఉత్తరప్రదేశ్ అంతటా నేరస్థులను ఎన్‌కౌంటర్ చేశారు. ఆపరేషన్ లాంగ్డా, ఆపరేషన్ ఖల్లాస్ కింద ఈ చర్య జరిగింది. నేరాలను తగ్గించడానికి, నేరస్థులను కఠినంగా శిక్షించడానికి ఈ ఆపరేషన్‌లు ప్రారంభించారు. మీరట్ నుంచి ముజఫర్‌నగర్ వరకు, పోలీసులు నేరస్థులను కాళ్ళపై కాల్చడం లేదా ఎన్‌కౌంటర్‌లో చంపేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రమంతటా ఆపరేషన్ లాంగ్డా, ఆపరేషన్ ఖల్లాస్ కొనసాగుతున్నాయి.…