Chhaava: ఉత్తర్ ప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, తన సహచరులతో కలిసి బాలీవుడ్ సినిమా ‘‘ఛావా’’ చూశారు. మరాఠా ఛత్రపతి శంభాజీ మహరాజ్ జీవితం ఆధారంగా ఈ సినిమా వచ్చింది. ఔరంగజేబు, మరాఠాల మధ్య ఘర్షణలను సినిమాలో చూపించారు. ఇదిలా ఉంటే, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఛావా సినిమాను చూడాలని మౌర్య కోరారు. దీని ద్వారా ఔరంగజేబు క్రూరత్వం ఆమెకు తెలుస్తుందని ఆయన అన్నారు.