యాదాద్రి భువనగిరి జిల్లాలోని ‘భూదాన్ పోచంపల్లి’కి ఉత్తమ ప్రపంచ పర్యాటక గ్రామంగా అంతర్జాతీయ గుర్తింపు లభించడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు.. ఐక్యరాజ్య సమితి అనుబంధ ప్రపంచ పర్యాటక సంస్థ, భూదాన్ పోచంపల్లిని ఉత్తమ ప్రపంచ పర్యాటక గ్రామంగా ఎంపిక చేయడం అభినందనీయమన్న కేసీఆర్.. తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం దిశగా స్వయంపాలనలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణ ఫలితంగా, తెలంగాణ చారిత్రక పర్యాటక ప్రాంతాలు అంతర్జాతీయ గుర్తింపును సాధిస్తున్నాయని తెలిపారు. Read…
తెలంగాణలోని భూదాన్ పోచంపల్లి విలేజ్ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది… రాష్ట్రంలోని చారిత్రక, పర్యాటక ప్రదేశాలకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోంది… ఇటీవలే రామప్ప దేవాలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ హోదాను కల్పించగా.. ఇప్పుడు ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా పనిచేస్తున్న ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్‌డబ్ల్యూటీవో) నిర్వహించిన బెస్ట్ టూరిజం విలేజ్ పోటీల్లో భారత్ నుంచి పోటీపడిన తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి గ్రామం ఆ ఘనత సాధించింది.. భారత్ నుంచి భూదాన్‌పోచంపల్లితో పాటు మేఘాలయలోని కాంగ్‌థాన్, మధ్యప్రదేశ్‌లోని…