ఏపీలో రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. అధికార పార్టీని అసమ్మతి సెగలు కమ్ముకుంటున్నాయి. మంత్రివర్గ విస్తరణ విషయం పార్టీని కుదిపేస్తోంది. అంతా బాగానే వుందని చెబుతున్నా.. పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదంటున్నారు నేతలు. నిన్నటి వరకు మాకు ఒక్కడే నాయకుడు అని డప్పులు కొట్టుకున్న పాలకపక్షం నేతలు ఇప్పుడు పదవుల కోసం కొట్లాడుకుంటున్నారని కామెంట్ చేశారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఒకే మాట ఒకే బాట అన్న నాయకులు నేడు పదవులకు ఏడుపులు, పెడబెబ్బలు…