కేరళ పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ కలిశారు. కొచ్చిలో సోమవారం రాత్రి మోడీతో వ్యక్తిగతంగా 45 నిమిషాల పాటు చర్చించారు. చిన్నప్పటి నుంచి మోడీని చూస్తూ పెరిగానని తాజాగా ప్రధానిని కలిసినందుకు తన ఆనందానికి అవధులు లేవని ఉన్ని ముకుందన్ పేర్కొన్నాడు.