జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో జరిగిన అవకతవకల పై రాష్ట్రానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ లేఖ రాసింది. తెలంగాణ రాష్ట్రంలో 9 జూన్ నుండి 12 జూన్ 2022 వరకు మహాత్మా గాంధీ NREGS అమలుకు సంబంధించి కేంద్ర బృందం క్షేత్ర స్థాయిలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే.. NREGS అమలులో అనేక అవకతవకలు గుర్తించింది. అనుమతి లేని పనులను చేపట్టడం (అటవీ ప్రాంతాల్లో ఆహార ధాన్యాలు ఆరబెట్టే ప్లాట్‌ఫారమ్ లేదా అస్థిరమైన కందకాల…