సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఢిల్లీకి వెళ్లిన వారిలో మంత్రి సీతక్క కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఈరోజు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ని తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కలిశారు. తెలంగాణలో గ్రామపంచాయతీ భవనాల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని మంత్రి సీతక్క కోరారు.