ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదవసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 2026-2027 కేంద్ర బడ్జెట్ ప్రకటనకు ముందు, టెక్ పరిశ్రమలో ఒక ప్రశ్న తలెత్తుతోంది. ఈ సంవత్సరం స్మార్ట్‌ఫోన్ ధరలు పెరుగుతాయా? అని చర్చలు ఊపందుకున్నాయి. భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్, డిజిటల్‌గా మారుతున్న ప్రజల దైనందిన జీవితాల్లో స్మార్ట్‌ఫోన్‌లు ఒక అవసరంగా మారుతున్నందున, వినియోగదారులు, నిపుణులు, స్మార్ట్‌ఫోన్ తయారీదారులు సహా అనేక మంది వాటాదారులు బడ్జెట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Also…