ఇటీవల కాలంలో మానవ సంబంధాలకు అసలు విలువే లేకుండా పోయింది. క్షణకాల సుఖం కోసం నీచమైన పనులు చేయడానికి కూడా మనుషులు సిద్ధమవుతున్న తీరు సభ్యసమాజం భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తోంది. ఏకంగా వావి వరసలు మరిచిపోయి మృగాల్లా ప్రవర్తిస్తున్నారు కొందరు దుర్మార్గులు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు ఈ మధ్యకాలంలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం నాగటూరులో దారుణం జరిగింది.