కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాయ్‌బరేలీ స్థానం నుంచి లోక్‌సభకు 6 పర్యాయాలు పూర్తి చేసిన సోనియా గాంధీ.. తొలిసారి రాజ్యసభలో అడుగు పెట్టనున్నారు. సోనియా గాంధీ ఫిబ్రవరి 15న రాజస్థాన్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు.. ఆమె లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. ఇదిలా ఉంటే రాజస్థాన్ నుంచి సోనియా గాంధీతో పాటు.. బీజేపీకి చెందిన చున్నిలాల్ గరాసియా, మదన్ రాథోడ్…
తెలంగాణ నుంచి రాజ్యసభ ఎంపీలుగా ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడు సీట్లకు మూడు నామినేషన్లే రావడంతో ఎన్నిక ఏకగ్రీవం అయింది. కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. కాగా.. రేపు ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని రేణుకా చౌదరి తీసుకోనున్నారు. మరోవైపు.. అనిల్ కుమార్ యాదవ్ కు రిటర్నింగ్ అధికారులు ఎన్నిక ధ్రువీకరణ పత్రం అందజేశారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవాల పర్వం కొనసాగుతోంది… వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్ది మినహా అందరూ నామినేషన్లు ఉపసహరించుకోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.. దీంతో వరంగల్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ స్థానాన్ని టీఆర్ఎస్ మరో సారి నిలబెట్టుకుంది. ఉమ్మడి జిల్లాలోని స్థానిక సంస్థల్లో మెజారిటీ ఉన్న టీఆర్ఎస్ ఈ కోటాలో మండలి స్థానాన్ని ఏకగ్రీవం చేసుకునేందుకు వేసిన ఎత్తుగడలు…