ఇవాళ కంఠమనేని ఉమా మహేశ్వరి అంత్యక్రియలను మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్లు ఎన్టీ రామారావు కుమారుడు నందమూరి రామకృష్ణ తెలిపారు. అయితే.. ఉమామహేశ్వరి పెద్ద కుమార్తె విశాల అమెరికాలో ఆమె భర్తతో కలిసి ఉంటున్నారు. ఆమె వచ్చేవరకు అంత్యక్రియలు ఆపినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. నేటి ఉదయం విశాల నగరానికి వచ్చేస్తారని ఆ తర్వాత అంత్యక్రియల ప్రక్రియ ప్రారంభమవుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. మాజీ సీఎం ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి (57) సోమవారం బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే.…