Eknath Shinde: మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న పోలింగ్ జరిగి, నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే, ఎన్నికలకు కొద్దిరోజులుగా శివసేన, బీజేపీ మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలోని ఉల్హాస్‌నగర్‌లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాంచందానీ చేసిన ప్రకటనపై శివసేన తీవ్ర స్థాయిలో మండిపడింది. బీజేపీ నేతలు క్షమాపణలు చెబితే తప్ప ఇక్కడ బీజేపీ అభ్యర్థికి శివసేన పనిచేయదని పేర్కొంది. యువసేన కళ్యాణ్ జిల్లా ప్రధాన కార్యదర్శి విక్కీ భుల్లార్ మాట్లాడుతూ.. రాంచందనీ…