రాజస్థాన్ ఉదయ్ పూర్ లో కన్హయ్య లాల్ దారుణ హత్య దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. అత్యంత పాశవికంగా ఇద్దరు మతోన్మాదులు హత్య చేయడాన్ని యావత్ దేశం ఖండిస్తోంది. మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్శ చేసిన అనుచిత వ్యాఖ్యలకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడనే కారణంతో మహ్మద్ రియాజ్, గౌస్ మహ్మద్ అనే ఇద్దరు దుండగులు గొంతు కోసి తలవేరు చేసి చంపారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై ప్రముఖులతో పాటు…