ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఈ డబుల్ మర్డర్స్ ఘటన జరిగింది. శరణ్య, లీలా సాయి అనే ఇద్దరు చిన్నారులు ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వారికి పురుగుల మందు తాగించి హత్య చేశాడు తండ్రి రవిశంకర్. అనంతరం తాను కూడా సూసైడ్ చేసుకుని చనిపోతున్నట్లు లేఖ రాసి పారిపోయాడు. దాదాపు 10 రోజులపాటు రవిశంకర్ జాడ తెలియలేదు.