బాబోయ్ వర్షాలు.. ఎన్నడూ చూడని విధంగా దంచికొడుతున్నాయి.. ఎటు చూసిన రోడ్లన్ని చెరువులను తలపిస్తున్నాయి.. తెలంగాణలో వర్షాలు గత కొద్దిరోజులుగా దుమ్ముదులిపి దంచికొడుతున్నాయి. హైదరాబాద్‌తో సహా అన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కాగా.. ఈరోజు సాయంత్రం నుంచి హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన వానలూ పడ్డాయి. అయితే.. మరో మూడు నుంచి నాలుగు రోజుల పాటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని…