ఏటీఎం ప్రారంభానికి ఎవరు వస్తారు? ఆ ఏటీఎంకి సంబంధించిన బ్యాంకు మేనేజర్, లేదా ఇతర కింది స్థాయి అధికారులు హాజరవుతారు. కానీ.. ఏటీఎం ప్రారంభానికి ఏకంగా ప్రధాని హాజరు కావడం ఎప్పుడైనా చూశారా? లేదా విన్నారా? కానీ.. ఇక్కడి అది జరిగింది. అవునండి.. నిజంగానే ఏటీఎం ప్రారంభానికి ప్రధాని హాజరయ్యారు. ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ.. ఏం చేస్తాం ఆ దేశంలో ఇదే తొలి ఏటీఎం మరి.
పసిఫిక్ మహాసముద్రంలో హవాయి, ఆస్ట్రేలియా మధ్య ఒక అందమైన పాలినేషియన్ ద్వీప దేశం ఉంది. ఇక్కడ దాదాపు 11 వేల మంది నివసిస్తున్నారు. ఇక్కడ ప్రజలకు ఎక్కువ సమయం లేదు. ఎందుకంటే వారి దేశం సముద్రంలో మునిగిపోతుంది. ఈ దేశం 9 చిన్న ద్వీపాలతో ఏర్పడింది. దాని ప్రధాన ద్వీపం యొక్క ఆకారం ఇరుకైన స్ట్రిప్ లాగా ఉంటుంది.
గ్లోబల్ వార్మింగ్ ఈ పేరు వింటే ప్రపంచం ఒడలు వణికిపోతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ నుంచి బయటపడేందుకు ప్రపంచదేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యం కారణంగా సముద్రంలోని నీటి మట్టాలు పెరుగుతున్నాయి. సముద్ర మట్టం పెరగడం వలన తీర ప్రాంతాల్లో ఉండే చిన్న చిన్న దీవులు, దేశాలు ఇబ్బందుల్లో పడుతున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న తువాలు దేశం గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఇబ్బందులు పడుతున్నది. ఈ దేశంలోని కొన్ని దీవులు ఇప్పటికే నీట మునిగాయి. …