బర్త్ సర్టిఫికెట్ల జారీ స్కాం లో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆర్డీవో స్థాయి అధికారి అనుమతి లేకుండానే వేల సర్టిఫికెట్లు జారీచేసినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. మీసేవా కేంద్రాల ద్వారా 22,954 సర్టిఫికెట్లు ఆర్డీఓ అనుమతి లేకుండానే జారీ అయ్యాయని గుర్తించారు. 2 వేలకు పైగా డెత్ సర్టిఫికెట్లు కూడా జారీ కాగా.. మీ సేవ కేంద్రాల ద్వారా 31 వేల నకిలీ సర్టిఫికెట్లు జారీ అయినట్లుగా ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.