దేశ రాజధాని ఢిల్లీలో దుమ్ము తుఫాన్ సృష్టించిన బీభత్సానికి ఇండిగో విమానం అల్లకల్లోలానికి గురైంది. దీంతో ప్రయాణికులంతా బెంబేలెత్తిపోయారు. ప్రాణ భయంతో కేకలు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సింగపూర్ ఎయిర్‌లెన్స్‌కు చెందిన విమానం ప్రమాదానికి గురైన దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. అందులోని దృశ్యాలు చూస్తుంటే.. ఎంతగా ప్రమాదం జరిగిందో స్పష్టంగా అర్థమవుతోంది.