గతంలో ఎన్నడూ లేనివిధంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో స్వామి వారి హుండీ ఆదాయం భారీగా పెరిగింది. మే నెలలో రికార్డు స్థాయిలో 130 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఒక్క నెలలోనే ఇంత భారీ స్థాయిలో ఆదాయం రావడం ఇదే మొదటిసారి. మే నెలలో 22లక్షల 62వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఎన్నడూ లేనివిధంగా చరిత్రలో తొలిసారి ఒక్క నెలలో స్వామి వారి హుండీ ఆదాయం భారీగా…