Municipal Elections Nominations: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగింది. వచ్చే నెలలో ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న కౌంటింగ్ జరగనుంది. 16వ తేదీన మేయర్లు, ఛైర్మన్ల ఎన్నిక జరుగుతుంది. నోటిఫికేషన్ విడుదలతోనే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. పురపోరు కోసం మూడు ప్రధాన పార్టీలు పోటాపోటీగా సిద్ధమవుతున్నాయి. పంచాయతీ ఎన్నికల ఫలితాలు కంటిన్యూ చేయాలని కాంగ్రెస్.. సత్తా చాటాలని బీఆర్ఎస్.. పట్టణ ప్రాంతాలపై పట్టు నిరూపించుకోవాలని బీజేపీ చూస్తున్నాయి.…