Donald Trump: అగ్రరాజ్యాధినేతగా, సంచలనాలకు కేంద్ర బిందువుగా నిత్యం వార్తల్లో నిలిచే అమెరికా అధ్యక్షుడు కొత్త రికార్డు నెలకొల్పారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో (UNGA) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రెండవ పదవీకాలంలో తొలిసారిగా ప్రసంగించారు. తాజాగా ఆయన తన ప్రసంగం నిడివితో వార్తల్లో నిలిచారు. ట్రంప్ ఈ సమావేశంలో దాదాపు గంటసేపు ప్రసంగించారు. READ ALSO: EPF Account: ఉద్యోగాన్ని వదిలేసిన తర్వాత EPF ఖాతాలో ఎంతకాలం డబ్బు ఉంచుకోవచ్చు?.. ఆ వయసు వరకు…
Trump: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 80వ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగిస్తూ, భారత్, చైనాలపై విమర్శలు చేశారు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు భారత్, చైనా నిధులు ఇస్తున్నాయని మండిపడ్డారు. రష్యన్ చమురు కొనుగోలు ద్వారా ఈ రెండు దేశాలు రష్యాకు సహకరిస్తున్నాయంటూ ఆరోపణలు గుప్పించారు. భారత్, చైనాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారానే యుద్ధానికి ప్రాథమిక నిధుల్ని సమకూరుస్తోందని అన్నారు.