Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అదే మాటలు చెప్పారు. భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు తానే కారణమని చెప్పుకొచ్చారు. భారత్-పాకిస్తాన్ సంఘర్షణతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఘర్షణలను ఆపినందుకు ట్రంప్ తనకు తాను ఘనత వహించారు. అమెరికా మధ్యవర్తిత్వంతో ‘సుదీర్ఘ రాత్రి’ చర్చల తర్వాత భారత్, పాక్ ‘‘పూర్తి, తక్షణ’’ కాల్పుల విరమణకు అంగీకరించాయని ఆదివారం ట్రంప్ సోషల్ మీడియాలో ప్రకటించారు.