Israel: 9/11 దాడుల తర్వాత అమెరికా ఏం చేసింది, తాము కూడా అదే చేస్తున్నామని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అన్నారు. ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదాపై అమెరికా స్పందించినట్లే తాము ఖతార్ రాజధాని దోహాలోని హమాస్ పొలిటికల్ బ్యూరోపై దాడులు చేశామని సమర్థించుకున్నారు. ఖతార్, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న ఇతర దేశాల వారిని బహిష్కరించాలని లేదా వారిని న్యాయం ముందు నిలబెట్టాలని ఆయన అన్నారు. ‘‘మీరు అలా చేయకుంటే మేము చేస్తాం’’ అని నెతన్యాహూ అన్నారు. అంతర్జాతీయంగా…