ఈ నెల 30న జరగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక తెలుగు వారినే కాదు ఢిల్లీని కూడా ఆకర్షిస్తోంది. ఈ హైవోల్టేజీ ఎన్నికను టీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీ అనే కంటే కేసీఆర్ వర్సెస్ ఈటల అంటే బాగుంటుందేమో. నిజానికి హుజూరాబాద్ ప్రజలు అలాగే పరగణిస్తున్నారు. పైగా ఈ ఉప పోరును ఒకరిపై ఒకరికి ద్వేషంతో చేస్తున్న పోరుగా చూస్తున్నారు. ఎలా మొదలైందో కానీ.. మొత్తానికి ఆట మొదలైంది. అయితే ఈ ఆటలో ఎవరు గెలుస్తారో ఇప్పటికి ఇప్పుడు చెప్పటం…