ఆ టీఆర్‌ఎస్ ఎంపీ కొన్నాళ్లుగా యాక్టివ్‌గా లేరు. మరోవైపు చూస్తున్నట్టు ప్రచారం జరిగింది. ఆ ప్రచారం వెనక కారణాలేవైనా.. పార్టీ మారడం లేదని ఓ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇంతకీ ఆయన ఎందుకా ప్రకటన చేశారు? తెరవెనక ఏం జరిగింది? ఎవరా ఎంపీ? రెండోసారి ఎంపీ అయ్యాక లోకల్‌గా ఇబ్బందులు!బీజేపీలోకి వెళ్తారని ప్రచారం! 2019 లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తొమ్మిది ఎంపీ స్థానాలను గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో జహీరాబాద్ నుంచి రెండోసారి లోక్‌సభ సభ్యుడయ్యారు బీబీ పాటిల్. నాటి…