భారత హాకీ చరిత్రలో గురువారం (ఆగస్టు 5) చరిత్రలో గుర్తుండిపోయే రోజు. మన్ ప్రీత్ సింగ్ నేతృత్వంలోని పురుషుల హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్‌లో జర్మనీని 5-4 తేడాతో ఓడించి కాంస్య పతకం సాధించింది. 1980 మాస్కో తర్వాత ఒలింపిక్స్‌లో భారతదేశానికి ఇదే మొదటి పతకం. ఈవెంట్ మొత్తంలో 12వ పతకం. దీంతో పురుషుల హాకీ జట్టును ట్విట్టర్ లో అభినందనలు వెల్లువతో ముంచెత్తారు. ప్రధానితో పాటు క్రీడా దిగ్గజాలు, బాలీవుడ్, టాలీవుడ్ తారలు ప్రతి ఒక్కరూ…