మాస్ మహారాజా రవితేజ ‘క్రాక్’ సినిమా సక్సెస్ తో మంచి జోష్ మీద ఉన్నాడు. ఈ సినిమా తర్వాత వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. తాజాగా త్రినాథరావు నక్కిన ప్రాజెక్ట్ అప్డేట్ ను రవితేజ స్వయంగా ప్రకటించారు. ‘సినిమా చూపిస్తా మావ’, ‘నేను లోకల్’ వంటి హిట్ చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ తన 69వ సినిమాను చేయనున్నాడు. ఈ నెల 4 నుంచి సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈమేరకు రవితేజ.. రోల్-కెమెరా-యాక్షన్…
దర్శకుడు త్రినాథరావు నక్కిన, రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ లది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. అయితే… ఒక్కోసారి ఎంత సక్సెస్ ట్రాక్ లో ఉన్న వారికైనా సినిమాను సెట్ చేయడానికి ఊహకందని అడ్డంకులు ఎదురవుతుంటాయి. ప్రసన్నకుమార్ చెప్పిన ఓ కథ నచ్చి, దానిని రవితేజ హీరోగా త్రినాథరావు దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించడానికి ముందుకొచ్చింది. ఇక అధికారిక ప్రకటనే ఆలస్యం అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఖిలాడీ చిత్రంలో నటిస్తున్న రవితేజ… ఆ తర్వాత శరత్ మండవ…