Manipur Violence: ఈశాన్య రాష్ట్రం మణిపూర్ హింసాకత్మ సంఘటనలతో అట్టుడుకుతోంది. మెజారిటీ మైతై కమ్యూనిటీని షెడ్యూల్ తెగలో చేర్చే చర్యలను వ్యతిరేకిస్తూ గిరిజన సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి. ఇవి నెమ్మదిగా హింసాత్మక సంఘటనలకు దారి తీసింది. ప్రార్థనా మందిరాలు, వాహనాలకు ఆందోళనకారులు నిప్పుపెడుతున్నారు. ఈ క్రమంలో మణిపూర్ రాష్ట్రంలో ఆర్మీ, అస్సాం రైఫిల్స్ బలగాలు మోహరించాయి.