అరటి పండులో తీపితో పాటు పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ పండు దాదాపు ఏ కాలంలోనైనా దొరుకుతుంది. ఈ పండు పోషకాల నిధి.. దీనిని ప్రజలు తరచుగా అల్పాహారంలో తీసుకుంటారు. చాలామందికి అరటిపండు అంటే ఇష్టముంటుంది. అయితే కొందరికి నచ్చదు. అరటిపండు తినడం వల్ల పొట్టలో కొవ్వును పెంచుతుందని నమ్ముతారు. అంతేకాకుండా.. పొత్తికడుపు ఊబకాయం పెరుగుతుందనే అపోహ కొంతమందిలో ఉంటుంది.