హైదరాబాద్ మెట్రో రైలు దేశంలో అత్యాధునిక నగర రవాణా వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తోంది. మూడు కారిడార్లలో 57 స్టేషన్లతో ప్రతిరోజూ సుమారు ఐదు లక్షల ప్రయాణికులకు సేవలందిస్తూ, నగర రవాణాలో కీలక పాత్ర పోషిస్తోంది. రోజువారీ ప్రయాణికుల్లో మహిళల శాతం సుమారు 30 ఉండటంతో, వారి భద్రత, సౌకర్యం, విశ్వాసం మెట్రో రైలు నిర్వహణలో అత్యంత ప్రాధాన్యత పొందుతున్న అంశాలుగా నిలుస్తున్నాయి. సమానత్వం, గౌరవం, సమాన అవకాశాలు అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అనుగుణంగా,…