ఆన్-డిమాండ్ స్ట్రీమింగ్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో.. వచ్చే రెండేళ్లలో ఒరిజినల్ షోలు, సినిమాలు మరియు కో-ప్రొడక్షన్‌లలో హిందీ, తమిళంతో పాటు తెలుగులో 40 కొత్త టైటిల్స్‌ను విడుదల చేయనున్నట్లు గురువారం తెలిపింది. భారతదేశంలో ఐదేళ్లు పూర్తి చేసుకున్న ఈ కంపెనీ, దేశంలోని ప్రైమ్ వీడియో స్టోర్‌తో పే-పర్-వ్యూ మూవీ సర్వీస్‌లోకి అడుగుపెడుతున్నట్లు, అలాగే రానున్న సంవత్సరాల లైసెన్సింగ్, ఒప్పందాలు మరియు వివిధ భారతీయ స్టూడియోలతో కో-ప్రొడక్షన్‌లను ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్ వీడియో హిందీ, తెలుగులో చిత్రాలతో…