Pending Challans: హైకోర్టు ఆర్డర్లను ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవడం లేదు. వాహనదారులపై రెచ్చిపోతున్నారు. ఆటోలు, బైక్స్ కనబడితే ట్యాబ్‌లు తీసి పెండింగ్ చలాన్ల చిట్టా విప్పుతున్నారు. ఒకవైపు హై కోర్టు వాహనదారులను ఆపొద్దంటూ ఆదేశాలు ఇచ్చినప్పటికీ.. తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. ఒక్కొక్క చౌరస్తాలో పదుల సంఖ్యలో ట్రాఫిక్ పోలీసులు పహరా కాస్తున్నారు. ఉదయాన్నే ఆఫీసులకు, స్కూళ్లకు, కాలేజీలకు వెళ్ళే వారి వాహనాలను ఆపితే త్వరగా వసూళ్లకు అవకాశం ఉంటుందని రంగంలోకి దిగారు.…