ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అధికారులు పదే పదే అవగాహన కల్పిస్తున్నప్పటికీ వాహనదారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. హెల్మెట్ లేకుండా, రాంగ్ రూట్, ట్రిపుల్ రైడింగ్, ఓవర్ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్, సిగ్నల్ జంపింగ్ వంటి ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు కొందరు వాహనదారులు. చివరకు పోలీసుల తనిఖీల్లో పట్టబడి భారీగా జరిమానాలు చెల్లిస్తున్నారు. తాజాగా ఓ బైక్ పై ఏకంగా 277 చలాన్లు నమోదయ్యాయి. రూ. 79,845 పెండింగ్ చలాన్లు ఉన్నాయి. ఈ క్రమంలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు…